IDOC లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
– జాతీయ పతాకం ను ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్
– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు
సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(IDOC)లో 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ పతాకమును ఆవిష్కరించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే,అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి ఐ డి ఓ సి లో మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్ వెంట ఆర్డిఓ టి శ్రీనివాసరావు, AO బి గంగయ్య, స్థానిక తహసిల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.