Inauguration of Pedda Amberpet Kalan Urban Forest Park in HarithaHaram Programme.

రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని సాధిద్దాం

సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ఆచరణలో చాటుదాం

రాష్ట్ర ప్రజానీకానికి మంత్రి కేటీఆర్ పిలుపు

పెద్ద అంబర్ పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును  ప్రారంభించిన మంత్రులు
కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి

రంగారెడ్డి : రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలన్న గౌరవనీయులుముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి సంకల్పాన్ని ఆచరణరూపం దాల్చేందుకు రాష్ట్ర ప్రజానీకం ముందుకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ
మంత్రి శ్రీ కె.తారక రామారావు గారు పిలుపునిచ్చారు. హైదరాబాద్మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) అభివృద్ధి చేసినరంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును
గురువారం ఉదయం అటవీ శాఖ మంత్రి శ్రీఎ.ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్రెడ్డి,  ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు, శ్రీమతి సురభి వాణిదేవి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఆర్.శోభ, పిసిసిఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, కలెక్టర్ అమోయ్ కుమార్తదితరులు మొక్కలు నాటారు.

తదుపరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ  మానవ హితిహాసంలోనే మూడవ అతిపెద్ద కార్యక్రమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 220 కోట్ల మొక్కలను నాటి వాటి సంరక్షించి
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొక్కలను పెంచడం, వాటిని సంరక్షించుకోవడం అలవాటుగా మార్చుకోవడం గర్వంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ  ఫారెస్ట సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టులు ఇందుకు తార్కాణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపుదల కు 129 పార్కులను అభివృద్ధి చేస్తుండడం సంతోషకరమన్నారు. హెచ్ఎండిఏ విస్తీర్ణంలో లక్షా అరవై
వేల(1.60లక్షల) ఎకరాల్లో 59 అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. మరో 16 పార్కులను ఇదే స్థాయిలో ఏర్పాటుచేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు.
మనిషి పుట్టుక, గిట్టుకలతో చెట్టుతో అవినాభావ సంబంధం ఉందని,
ప్రాణవాయువు అందించే చెట్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కేటీఆర్ తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని సీఎం కేసీఆర్ గారు గుర్తించి చట్టబద్దమైన నిబంధలు రూపొందించారని తెలిపారు. అందులో భాగంగానే కొత్త మున్సిపల్ చట్టం,
పంచాయతిరాజ్ చట్టం రూపొందాయన్నారు.  స్థానిక సంస్థల్లో పది శాతం బడ్జెట్ గ్రీన్ బడ్జెట్గా నిబంధలు విధించారన్నారు.  పెట్టిన మొక్కల్లో 85 శాతం మనుగడసాధించలేని పక్షంలో అక్కడి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే కఠిన నిబంధనలు కూడా పొందుపరిచారని వివరించారు.
అటవీ శాఖ మంత్రి శ్రీ ఎ.ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమం నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దేశంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు.  ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా 15,500 నర్సరీలు తెలంగాణలో పనిచేస్తున్నాయని, వాటిల్లో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ నర్సరీలు ప్రధాన భూమిక
పోషిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు హరిత హారం కింద రూ.5,900 కోట్ల నిధులు ఖర్చుచేశామని, గత ఏడు విడతల్లో 220 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటామని, ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత
హరిత హారం కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా నాలుగు శాతం మేరకు అడవుల విస్తీర్ణం పెరిగాయన్నారు.
అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎ.శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా అరవై వేల ఎకరాల అటవీ భూములు పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయి. వీటిని ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుగారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో  129 అర్బన్ పార్కులను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని వివరించారు.  ఇందు కోసం దాదాపు రూ.660 కోట్ల అంచనాలతో ముందుకుసాగామని, వాటిల్లో ఇప్పటి వరకు 59 పార్కులు పూర్తి అయ్యాయి, అందులో 32 పార్కులు హెచ్ఎండిఏ పరిధిలో అభివృద్ధికి నోచుకోవడం సంతోషకరమన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పట్నం మహేందర్రెడ్డి, శంబీపూర్ రాజు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల
అనితారెడ్డి, పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న లతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ  డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అటవీ శాఖ
అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Share This Post