Inspection of Area Hospital, by Dist. Collector Vikarabad

పత్రికా ప్రకటన,తేది: 07.09.2021

వికారాబాద్ జిల్లా :- ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు.
మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో వాక్సినేషన్, ఐసొలేషన్, ఆబజర్వేషన్ రూంలతో పాటు నిర్మాణంలో ఉన్న ఇతర గదులను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు వైద్య సిబ్బంది అందరు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతిరోజు పారిశుధ్య పనులు తప్పకుండ చేపట్టాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డాక్టర్ యాదయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. DPRO / Vikarabad.

Share This Post