ITDA UTNOOR: గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

పత్రిక ప్రకటన తేది: 11.03.2023

గిరి విద్యార్థులలోని విద్యా, కళా ప్రతిభను ప్రోత్సహించేందుకు గిరిజన కల్చరల్ ఫెస్ట్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. శనివారం ఉట్నూరు కే.బి కాంప్లెక్స్ లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గిరిజన కల్చరల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జ్యోతి వెలిగించి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులలో దాగివున్న విద్యా, కళా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి గిరిజన కల్చరల్ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో సైన్స్ ఫేర్, కల్చరల్ ఫేస్ట్, వార్షికోత్సవాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ కళలను సహకారం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయిలలో నిలవాలని కోరారు. ఐ టి డి ఏ పీవో కె. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ చాటేలా ప్రతి సంవత్సరం గిరిజన కల్చరర్ ఫేస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఆశ్రమ విద్యార్థులు డివిజన్ స్థాయిలలో నిర్వహించిన నృత్య ప్రదర్శన, పాటలు, జానపదాల ఆలాపన, చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలతోపాటు మాక్ పార్లమెంట్, స్పెల్- బి, మిమిక్రీ వంటి పోటీలలో ప్రతిభ కనబరిచి ఈ గిరిజన కల్చరల్ ఫేస్ట్ లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రతి సంవత్సరం అక్టోబర్ లో క్రీడోత్సవాలు, జనవరిలో సైన్స్ ఫేర్ ప్రదర్శనలు, మార్చిలో గిరిజన కల్చరల్ ఫేస్ట్ వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించినట్టుగానే క్రీడలు , సైన్స్, గిరిజన కల్చరల్ లో అదేవిధంగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి పోటీలో గెలుపోటములు సహజమని ఓడినప్పుడు అధైర్య పడకుండా తిరిగి ప్రయత్నించినప్పుడే విజయం సాధిస్తారని విద్యార్థులకు వివరించారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల నృత్య, కళా ప్రదర్శనలు, ఆటలు, పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతకు ముందు సమావేశ హాలులో నిర్వహించిన మాక్ పార్లమెంట్, చిత్ర లేఖనం, క్విజ్ పోటీలను పీవో, అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ కుమార్, ఉట్నూర్, భీంపూర్ జెడ్పిటిసిలు చారులత, సుధాకర్, డిటిడిఓ లు మనెమ్మ, నీలిమ, ఎ సి ఎం ఓ జగన్, ఎటిడిఓ లు సౌజన్య, నిహారిక, క్రాంతి కుమార్, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

….. గిరిజన కల్చరల్ లో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన 51 మంది విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అధికారులు అందజేసి అభినందించారు.

అదనపు పౌర సంబంధాల అధికారి (ఐటీడీఏ) ఉట్నూరుచే జారీ చేయనైనది.

Share This Post