పత్రిక ప్రకటన తేది. 01.02.2023
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి పటిష్ట చర్యలు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలోని తన చాంబర్ లో మత్స్యకారులకు వల, ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ఐటిడిఎ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల మత్స్య కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు 290 చెరువులకు గాను ఇప్పటివరకు 113 చెరువులలో సొసైటీలను ఏర్పాటు చేసి 3279 మంది మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. గిరిజన, గిరిజనేతర మత్స్యకారులకు, మత్స్య శాఖ ద్వారా వల, టూ వీలర్ వాహనాలు, తెప్ప, ఐస్ బాక్స్ లు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మత్స్య కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పేసా కో-ఆర్డినేటర్ వసంతరావు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి (ఐటిడిఎ) ఉట్నూరు చే జారీ చేయనైనది.