Jilla Collector L. Sharman and MLA Jaipal Yadav participated in Palle Pragathi program at Kalwakurthi

పత్రిక ప్రకటన
తేదీ. 6-7-2021
నాగర్ కర్నూల్ జిల్లా.
పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తి అయ్యే నాటికి జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులు బహు వారుసల్లో మొక్కలు కనిపించాలని లేని పక్షములో ఆయా మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ హెచ్చరించారు. మంగళవారం ఉదయం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామంలో కల్వకుర్తి శాసన సభ్యులు జి. జైపాల్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి పై మొక్కలు నాటిన కలెక్టర్ పల్లెప్రగతి పూర్తి అయ్యేనాటికి అన్ని రహదారులకు ఇరువైపుల హరితహారం మొక్కలు పలు వరుసల్లో కనిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసే ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం వంగూర్ మండలంలోని తుమ్మల పల్లి ప్రధాన రహదారి, చారగొండ మండలం జూపల్లి గ్రామం వైకుంఠ ధామం వద్ద మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమలో పాల్గొన్న కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలంన్నారు. గ్రామాల్లో పారిశుథ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామంలోని చెత్తను తొలగించి ఎక్కడ మురుగు లేకుండా పరిశుభ్రము చేసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకై హరితహారం లో విరివిగా మొక్కలు నాటాలని తెలియజేసారు. తర్నికల్ గ్రామంలో యస్సి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.10 లక్షలు, డ్రైనేజి ల నిర్మాణానికి తన యం.యల్.ఏ నిధుల నుండి మంజూరు చేస్తానని ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేసి బృహత్తరమైన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.డి.డి.ఆర్.డిఓ నర్సింగ్ రావు, డి.పి ఓ రాజేశ్వరి, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, యం.పి.డి.ఓ బాలచందర్, జడ్పిటిసి భరత్ కుమార్, యం.పి.పి. ఎ. సునీత , తర్నికల్ సర్పంచ్ పాండు, జూపల్లి లో సర్పంచ్ మల్లీశ్వరి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
—————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ చేయడమైనది

Share This Post