JNTU కళాశాల కు స్థల కేటాయింపు లపై సమావేశం: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*JNTU కళాశాల కు స్థల కేటాయింపుల పై సమావేశం*

 

—————————

శనివారం IDOC లో
JNTU కళాశాల భవనముల నిర్మాణం కోసం స్థల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో JNTU రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ సమావేశం అయ్యారు.

 

JNTU కళాశాల తరగతులు సిరిసిల్ల లో అద్దె భవనాల్లో జరుగుతున్నాయని…..
ఈ మధ్యే భవనముల నిర్మాణం యూనివర్సిటీ నుంచి నిధులు మంజూరు అయ్యాయని రిజిస్ట్రార్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణాలకు స్థల కేటాయింపులు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు .

JNTU కళాశాల శాశ్వత భవనాల నిర్మాణాల పెద్దూర్ లో స్థలాన్ని గుర్తించామని త్వరలో నే కేటాయింపులు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అనంతరం జిల్లా కేంద్రం సిరిసిల్ల లో జె ఎన్ టి యు కళాశాల తరగతుల నిర్వహణ తీరును రిజిస్ట్రార్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వివరించారు.

సమావేశంలో RDO టి శ్రీనివాస్ రావు,
JNTU అధికారులు పాల్గొన్నారు.
——————————

Share This Post