MBNR – అంగన్ వాడి కేంద్రాల కార్యక్రమాలను తనిఖీ చేసే నిమిత్తం మండలానికి మూడు బృందాలను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.

అంగన్ వాడి కేంద్రాల కార్యక్రమాలను తనిఖీ చేసే నిమిత్తం మండలానికి మూడు బృందాలను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి ఐ సి డి ఎస్ కార్యక్రమాలతోపాటు, ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై అంగన్వాడీ కేంద్రాల సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఐసిడిఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, మహిళలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు గాను తనిఖీ బృందాలను నియమిస్తున్నమని, ఈ బృందాలలో మండల స్థాయి అధికారులు ఉంటారని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారంతో పాటు గుడ్డు, పాలు సరైన విధంగా అందించాలని, అదేవిధంగా పిల్లల పెరుగుదల చార్ట్ ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ బృందాలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనకి తోపాటు,అంగన్ వాడి కార్యక్రమాలను కూడా తనిఖీ చేస్తారాని వెల్లడించారు. రెవెన్యూ ,పంచాయతీరాజ్ శాఖ లతోపాటు, ఐసిడిఎస్ అధికారులు కూడా ఈ బృందాలలో ఉంటారని వెల్లడించారు. గతంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని ఆయన ఆదేశించారు.ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత కేంద్రాల పరిధిలోని సిడిపిఓలు ,సూపర్వైజర్లు పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ- శ్రామ్ స్టేటస్ ను జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా మహిళ జిల్లా మహిళా సంక్షేమ అధికారి రాజేశ్వరిని ఆదేశించారు.
ఇప్పటి వరకు అంగన్వాడీ కార్యకర్తలు ,టీచర్లు అన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారని, అదేవిధంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఇంటింటికి తిరిగి అందరికీ వ్యాక్సిన్ వేసి విజయవంతం చేయాలని అన్నారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా దాదాపు 90 శాతం పైగా అంగన్వాడీ టీచర్లను బి ఎల్వీఓ లు గా నియమించడం జరిగిందని, నవంబర్ 1 నుండి 30 వరకు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా ఈ నెల 6 ,7,26,27 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందువల్ల అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలు లోనే ఉండాలని, బూత్ స్థాయి ఏజెంట్లను, గ్రామ పెద్దలు,బూతు పరిధిలోని పెద్దలను పిలిపించి చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించడం,శాశ్వతంగా వలస వెళ్లిన వారికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం చేయాలని, ఒకవేళ ఎవరైనా జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తయినట్లైతే వారిచేత కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలల మాదిరిగానే అన్ని అంగన్వాడి కేంద్రాలు కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచాలని, ఇందుకు డిపీఓ సహకారంతో పూర్తి స్థాయిలో అంగన్ వాడి కేంద్రాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ని రాజేశ్వరి, సిడిపిఓలు ,సూపర్వైజర్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Share This Post