MBNR – అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే సరైన మార్గమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే సరైన మార్గమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్బంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై పిల్లలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు .అదేవిధంగా అగ్నిమాపక శాఖలో పనిచేసే వారు ప్రాణాలకు తెగించి అగ్ని ప్రమాదాలు నివారిస్తారని, అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు, పెద్దలకు శిక్షణ కార్యక్రమాలతో పాటు, నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా చూడాలని అన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతా రామారావు మాట్లాడుతూ ఆదిమానవుడు నిప్పును కనుగొన్నాడని నిప్పును మంచి కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితులలో నష్టాలకు ఉపయోగించకూడదని, అగ్ని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలను నివారించాలని, అగ్ని ప్రమాదాలపై వారం రోజుల పాటు జిల్లా ప్రజలకు మంచి అవగాహన కల్పించారని అన్నారు .
జిల్లా ఎస్ పి ఆర్ వెంకటేశ్వర్లు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Share This Post