MBNR – అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రత్యక్ష ప్రజావాణి కార్యక్రమం తిరిగి సోమవారం ప్రారంభమైంది.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించ గా వెల్లువలా ఫిర్యాదుదారులు వచ్చాయి.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఇకపై ప్రతి సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 నుండి 11 వరకు జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశం ఉంటుందని ,జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో ఆన్ లైన్ ద్వారా మండల స్థాయి అధికారులు కూడా అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు .
సోమవారం జిల్లా స్థాయి అధికారి నుంచి మొదలుకొని మండల స్థాయి అధికారి వరకు ఎవరు ఎలాంటి క్యాంపులు నిర్వహించవద్దని అన్నారు. మండల స్థాయి అధికారులు జిల్లా అధికారుల సమీక్ష సమావేశం వివరాలను కూడా తెలుసుకోవాలని, అన్ని అంశాలపై కచ్చితంగా పట్టు కలిగి ఉండాలని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ,ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ను జాప్యం లేకుండా పరిష్కరించాల్సిన అవసరం అధికారులపై ఉందని ఆయన అన్నారు.
జిల్లా స్థాయిలో ప్రజా వాణి నిర్వహించినట్లు గానే మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహించాలని తాసిల్దార్ లు,ఎం పి డి ఓ లను ఆయన ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు రాగా వీటిలో భూ సంబంధిత సమస్యలు,వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి

ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,డి ఆర్ ఓ కె.స్వర్ణలత ,ఆర్డిఓ పద్మ శ్రీ,జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు రెవెన్యూ సమావేశ మందిరంలో పాల్గొనగా, మండలాల నుంచి తహసిల్దార్లు, ఎంపీడీవోలు వారి వారి కార్యాలయం నుండి ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Share This Post