MBNR – అధికారుల సమన్వయంతో అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

అధికారుల సమన్వయంతో అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అంతకుముందు మండల అధికారులతో ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు .
జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశం లో జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారికి 100% వాక్సినేషన్ లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాన్ని జిల్లా అధికారులు అందరి సహకారంతో ఇప్పటివరకు 62.58 శాతాన్ని పూర్తిచేశామని, జిల్లాలో మొత్తం 5 లక్షల 89 వేల మందికి వాక్సిన్ వేసే లక్ష్యానికి గాను ఇప్పటివరకు 3.85 లక్షల మందికి వాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన అధికారులు అందరినీ ఆయన అభినందించారు.
అదేవిధంగా జిల్లాకు రెండు లక్షల ముప్పై ఐదు వేల బతుకమ్మ చీరలు వచ్చాయని వాటిని కూడా మండలాలు, మున్సిపాలిటీల వారీగా త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు.
పశుసంవర్ధక, శాఖ ద్వారా అమలు చేయనున్న యూనిట్ల గ్రౌండింగ్ కు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాలను మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పారు.
పల్లె ప్రగతికి సంబంధించి చేపట్టిన మౌలికవసతుల పై నివేదికను క్రోడీకరించి ఫోటోలతో సహా సమర్పించాలని ఆయన ఆదేశించారు.
ఆజాదికా అమృతోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న న్యాయ అవగాహన సదస్సులకు మండల స్థాయి అధికారులు కూడా పాల్గొనాలని,గ్రామ ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకొవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ప్రజా వాణి ఫిర్యాదులను వారానికి మించి పెండింగ్లో ఉంచవద్దని ఆదేశించారు .
ఈ సందర్భంగా సీఎం జి బి ఫిర్యాదులు, ప్రజావాణి వాట్స్అప్ కాల్ ఫిర్యాదులు ,రెగ్యులర్ ఫిర్యాదులను ఆయన సమీక్షించారు.
అనంతరం ధరణి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
కాగా ఈ సోమవారం ధరణి ప్రజావాణికి 41 ఫిర్యాదులు,సాధారణ ప్రజావాణికి 27 ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.
డి ఆర్ ఓ కే. స్వర్ణలత ,ఆర్ డి ఓ పద్మశ్రీ, జడ్పీ సీఈఓ జ్యోతి, డిఆర్డిఓ యాదయ్య ఇతర అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post