MBNR – అన్ని రకాల మొక్కలతో జిల్లా స్థాయి నర్సరిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అధికారులను ఆదేశించారు.

అన్ని రకాల మొక్కలతో జిల్లా స్థాయి నర్సరిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం 23 వ సర్వేనెంబర్ లో జిల్లా స్థాయి నర్సరీ ఏర్పాటుకై స్థలాన్ని తనిఖీ చేశారు.
రూరల్ తాహసిల్దార్ ద్వారా భూమికి సంబంధించిన వివరాలన్నీ పరిశీలించిన మీదట అక్కడ అన్ని రకాల మొక్కలతో ముఖ్యంగా పూలు, పండ్లు, ఉద్యాన మొక్కలతో పాటు ,రహదారికి ఇరువైపులా నాటే మొక్కలు ,సంస్థలు, అన్ని రకాల మొక్కలు పెంచేందుకు ఉద్దేశించి పెద్ద ఎత్తున జిల్లాస్థాయి నర్సరీని ఏర్పాటు చేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. అంతేకాక ఈ నర్సరీ జిల్లా స్థాయి నర్సరీ గా ఉండాలని, ఇక్కడి నుండి అన్ని మొక్కలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా 23 వ సర్వేనెంబర్ లో సుమారు 109.13 ఎకరాల సీలింగ్ భూమి అందుబాటులో ఉండగా ఈ స్థలం అన్ని రకాల నర్సరీలను ఏర్పాటు చేసేందుకు కు అనువుగా ఉంది.
జిల్లా కలెక్టర్ వెంట రూరల్ తాహసిల్దార్ పాండు తదితరులు ఉన్నారు.

Share This Post