MBNR – అభినవ పూలే కె సి ఆర్ – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలు ఆర్థికంగా బలపడేందుకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర రావు పూలే తర్వాత అభినవ పూలే అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో లో వైన్ షాపుల కేటాయింపు లో ఎస్సీ, ఎస్టీల తోపాటు, గౌడ లకు రిజర్వేషన్ కల్పించినందుకు గాను ఆదివారం మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ,బిసి, గౌడ సంఘాల ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్ షాపుల కేటాయింపులో ఎస్ సి ల కు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం,గౌడ కులస్తులకు 15 శాతం కేటాయించిందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీలు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో 1000 గురుకులాల ను ఏర్పాటు చేయటం జరిగిందని, అన్ని కులాల వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. గొల్ల,కురుమలకు గొర్లు ఇవ్వడం ద్వారా వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని, అదేవిధంగా ముదిరాజులకు చేపపిల్లలు, ట్రాలీలు, బండ్లు ఇచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు .రాష్ట్రంలో కుల వృత్తుల అన్నింటికీ పూర్వ వైభవం వస్తుందని, చిన్న చిన్న కులాల అభివృద్ధికి గతంలో పూలే కృషి చేశారని,పూలే తర్వాత అభినవ పూలేగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్ రావు పాటుపడుతున్నారని అన్నారు. అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కృషి చేయడం గొప్ప విశేషమని అన్నారు .ఇది దేశంలో పెద్ద మార్పును తీసుకు వస్తుందని, అన్ని రాష్ట్రాల నుండి కూడా మంచి డిమాండ్ వస్తుందని, తద్వారా అందరూ బాగుపడతారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, బోయపల్లి పురుషోత్తం గౌడ్,క్రాంతి గౌడ్ ,పి ఆర్ టి యు అధ్యక్ష్యులు నారాయణ్ గౌడ్,సాయిలు గౌడ్,సీను నాయక్,పత్తి వెంకట్రాములు, నాగరాజు,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post