MBNR – ఆచార్య కొత్త పల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

                 ఆచార్య కొత్త పల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు .
                 ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్బెల్ట్ వద్ద ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
                  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్పూర్తి తో, వారి భావ వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గుర్తించి ఏలాంటి రక్తపాతం లేకుండా, గాంధేయ మార్గం ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ తెచ్చేందుకు ఆయన తోడ్పాటు అందించారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన నిర్వహించడం జరుగుతున్నదని, గత 7 సంవత్సరాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. గతంలో కరెంటు, తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానానికి వచ్చిందని, భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.
                   ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, తెలంగాణ ఉద్యమ కళా కారుల సంఘం అధ్యక్షులు వెంకటేష్, బాలచందర్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, రామలింగం, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post