MBNR – ఆజాదికా అమృత మహోత్సవాల్లో భాగంగా ఉచిత న్యాయ సేవల గురించి జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లినట్లు జిల్లా జడ్జి ఎస్. ప్రేమవతి తెలిపారు .

ఆజాదికా అమృత మహోత్సవాల్లో భాగంగా ఉచిత న్యాయ సేవల గురించి జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లినట్లు జిల్లా జడ్జి ఎస్. ప్రేమవతి తెలిపారు .
ఆజాది క అమృత మహోత్సవాల్లో భాగంగా చేపట్టిన పాన్ ఇండియా అవెర్ నెస్ మరియు అవుట్ రీచ్ కార్యక్రమం ముగింపు ఉత్సవాలను జిల్లా కోర్ట్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని జిల్లా న్యాయ సేవా సదనం నుండి ప్రభాథ్ భేరి ర్యాలీని జిల్లా జడ్జి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ తెలంగాణ చౌరస్త,క్లాక్ టవర్ల మీదుగా మళ్ళీ జిల్లా కోర్టు కు చేరుకున్న అనంతరం న్యాయ సేవ సదన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ల ఆదేశాల మేరకు గత నెల 2 నుండి ఈ నెల 14 వరకు పాన్ ఇండియా ఆవేర్ నెస్ మరియు అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి వ్యక్తికి ఉచిత న్యాయ సేవల గురించి ప్రచారం చేపట్టడం జరిగిందని, అన్ని గ్రామాలను దాదాపు మూడు సార్లు కవర్ చేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో పార లీగల్ వాలంటీర్లు, ఆశ ,అంగన్వాడీ, పోలీస్,జ్యూడిసియల్ అధికారులు పాల్గొని విజయవంతం చేశారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించి ప్రజలకు ఉచిత న్యాయ సేవ సహకారాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉచిత న్యాయ సేవల వల్ల ఇంకా అడ్వకేట్ లకు క్లైంట్స్ పెరుగుతారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడు ఇలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయ అవగాహన ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు

ఈ కార్యక్రమం లో మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి రఘురాం, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకటరాం, ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆన్నే రోజ్ క్రిస్టియన్,జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ ఎం. సంధ్యారాణి, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లు శ్రీదేవి, కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు, యోగేశ్వర్ రాజు యాదవ్, గవర్నమెంట్ ప్లీడర్ మనోహర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్, డి ఆర్ డి ఓ యాదయ్య , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య , జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి డి పి ఆర్ ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post