MBNR – ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వి.సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వి.సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
బుధవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “మహిళా సాధికారత,గృహ హింస, మహిళా ఉద్యోగినులు పని చేసే చోట లైంగిక వేధింపులు” అన్న అంశంపై నిర్వహించిన సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు .
సమాజంలో ఆడ, మగ ఇద్దరిని సమానంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా కమిషన్ ద్వారా మహిళలకు రక్షణ, హక్కుల పై అవగాహన కల్పించడంతోపాటు, కమిషనర్ దగ్గరికి వచ్చిన వారికి అందించే సహాయం పై వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. పోష్ చట్టం ప్రకారం ప్రతి శాఖలో ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించాలని, పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని తెలిపారు. అలాగే పెళ్లయిన ఆడ పిల్లల పట్ల అత్తమామల విషయంలో కూడా మార్పు రావాలని, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు కూడా వారు మంచి ఆశావాద దృక్పథంతో ఉండాలని,అత్తా మామలను తల్లి దండ్రులలా భావిస్తే వేధింపులు ఉండవని అన్నారు. అంగన్వాడి పరిధిలో బాల్యవివాహాలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, చివరి నిమిషంలో బాల్య వివాహాలు ఆపడం వల్ల అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చులు తప్పవని అన్నారు .అలాగే ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ,సోషల్ ఆక్టివిటీ కమిటీలను పటిష్టపరచడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటివి చేయాలని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం షీ టీములు ఏర్పాటు చేసిందని, అంతేకాక భరోసా కేంద్రాలను నెలకొల్పిందని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి ప్రారంభోపన్యాసం చేయగా, పోసో చట్టంపై డి వి సి ఎల్ జిల్లా కో ఆర్డినేటర్ అరుణ, మహిళా చట్టాల పై అడ్వకెట్ రవి కుమార్ యాదవ్,మహిళా సాధికారత,ఉపాధి పై ఏ పి డి శారద, గృహ హింస పై నాగరాణి, తదితరులు మాట్లాడారు.
ఆడ పిల్లలకు సంబంధించి ఇందిరా ప్రియదర్శిని సంస్థ రూపొందించిన ఆడపిల్లల లోటు- సమాజానికి చేటు అన్న కర పత్రాన్ని ఆవిష్కరించారు.
ఆనంతరం ఆమె సమాచార శాఖ ఆధ్వర్యంలో పోషన్ మహా,మహా ఉత్పత్తుల పై ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను ప్రారంభించి తిలకించారు.

ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ సభ్యులు సాహీన్ ఆఫ్రిది, కె.ఉమాదేవి,జి పద్మ,ఎస్.లక్ష్మీ, రేవతి, ఆర్ డి ఓ పద్మశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి , డ్ఈ ఆర్ డి ఓ యాదయ్య,జెడ్ పి ఇంచార్జ్ సి ఈ ఓ మొగులప్ప తదితరులు ఉన్నారు.

Share This Post