MBNR – ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష వెయ్యి 16 రూపాయలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష వెయ్యి 16 రూపాయలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .
శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ లో మహబూబ్ నగర్ నియోజక వర్గానికి సంబంధించి సుమారు 600 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 6 కోట్ల 60 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం లో భాగంగా పెన్షన్ల తోపాటు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు .
మహబూబ్ నగర్ జిల్లాలో రహదారులు,జంక్షన్లు, దేవాలయాలు,మసీదులు,చర్చి ల అభివృద్ధి తో పాటు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద అనారోగ్యం పాలైన వారికి ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందిన వారికి కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, వచ్చేనెలలో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించనున్నామని తెలిపారు.
ఇవే కాకుండా మైనార్టీలకు రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలలు నిర్మించామని, గతంలో పట్టణంలో 14 రోజులకొకసారి తాగు నీరు వచ్చేదని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు తగు నీరిస్తున్నామని, పూజారులు,ఇమాంలు, పాస్టర్లకు నెల నెల గౌరవ వేతనాలు ఇస్తున్నామని, అంతేకాక అన్ని మతాల వారికి స్మశాన వాటికలకు నిధులు ఇచ్చామని తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి మహబూబ్ నగర్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, పట్టణంలోని ప్రజలు అందరు కలిసి మెలిసి ఉండాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు , ముడా చైర్మన్ గంజి వెంకన్న ,డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిజాం పాషా, కొరమోని వెంకటయ్య,మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ రహమాన్,అన్ని అవార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Share This Post