MBNR – ఆయా ప్రాజెక్టుల కింద పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.

ఆయా ప్రాజెక్టుల కింద పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.
ప్రతి మంగళవారం నిర్వహించే భూసేకరణలో భాగంగా ఈ మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో భూసేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .
ముందుగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు భూసేకరణ పనులను ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తు గ్రావిటీ కెనాల్ ,ప్రధాన ఎడమ కాలువ తదితర భూసేకరణ పనులపై ఆరా తీశారు .
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పనులు వేగవంతం చేయాలని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ లతో మాట్లాడుతూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇతర సంబంధిత ఇంజనీర్లు,అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు.

Share This Post