MBNR – ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

@ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
వివిధ ఇంజనీరింగ్ శాఖలు, ఇతర శాఖల ద్వారా చేపట్టిన పనులన్నిటిని రెండు ,మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మంగళవారం మహబూబ్ నగర్ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు కష్టపడి పని చేయాలని, పని చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని ,శక్తివంచన మేరకు కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా ఆశావాద దృక్పధం కలిగి ఉండాలని, పేదవారికి సహాయం చేయాలన్న తపనతో పని చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని అన్ని శాఖలు అధికారులు బాగా పనిచేస్తున్నారని , పంచాయతీరాజ్ ,వైద్య ఆరోగ్య, మరికొన్ని శాఖలు వారికి అప్పగించిన ఇంజనీరింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వచ్చే నాలుగు లైన్ల రహదారికి ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలని డి ఎఫ్ ఓ ను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని రహదారులపై,బై పాస్ రహదారి , ఇతర ప్రధాన రహదారులకు ఇరువైపుల రెందు, మూడు వరుసలో మొక్కలు నాటాలని అన్నారు . మహబూబ్ నగర్ పట్టణంలో కూడా రహదారులకిరుపక్కన సుందరంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమం లో భాగంగా జిల్లా కేంద్రంలో 120 కోట్ల రూపాయలతో ఆరు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల న్నింటిని ఒకే ప్రాంగణంలో నిర్మిస్తున్నామని, వీటి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రానికి ప్రజలు వచ్చేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని, అవసరమైతే బోర్డులు ,హోర్డింగులు ఏర్పాటు చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేసే గుడ్లు, ఇతర పౌష్టికాహారంలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. హాస్టల్స్ ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు .పేద ప్రజల సంక్షేమానికి అమలు చేసే పనులలో దళారులను సహించబోమని హెచ్చరించారు.
మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు మంత్రి పట్టాలను అందజేశారు.
కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను అమెరికన్ యూనివర్సిటీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ కు గుర్తింపుగా డాక్టరేట్ పట్టాను ఇచ్చి గౌరవించి న విషయం తెలిసిందే.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు,ఎస్ పి ఆర్.వెంకటేశ్వర్లు,జిల్లా అధికారులు మంత్రిని ఘనంగా సన్మానించారు.
వైద్య కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ . టి . పి . సి . ఆర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఏస్. వెంకట రావు జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లు తేజస్ నందలాల్ పవర్, కే .సీతారామారావు, డి ఆర్ ఓ కె.స్వర్ణలత,మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ, జిల్లా అధికారులు లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post