MBNR – ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి జిల్లా రైతులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు కోరారు.

ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి జిల్లా రైతులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు కోరారు.
శుక్రవారం అయన మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం, తాటికొండ పరిధిలోని మంజుల అనే ఆయిల్ పామ్ సాగు రైతు కు చెందిన ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించారు .
సుమారు 20 నెలల వయసున్న ఈ ఆయిల్ పామ్ తోటలో మహిళా రైతు మంజుల సమీకృత వ్యవసాయం కూడా చేస్తున్నారు . 5 ఎకరాలలో ఆయిల్ పామ్ చెట్ల పెంపకం తో పాటు, గొర్రెలు, గేదెలు, బాతులు, కోళ్ల పెంపకంతో పాటు, వ్యవసాయ పొలం చుట్టూ సరిహద్దులో శ్రీగంధం చెట్లను పెంచుతున్నారు. అంతేగాక అంతర పంటగా బంతి, ఇతర పూల మొక్కలను పెంచడం,సమీకృత వ్యవసాయం పట్ల జిల్లా కలెక్టర్ మహిళా రైతును,భర్త సుధాకర్ లాల్ ను అభినందించారు.తోట బాగుందని ప్రశంసించారు.
ఆయిల్ పామ్ తోటలకు ప్రభుత్వం తరఫున 100% సబ్సిడీ పై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ,90% సబ్సిడీపై మొక్కలను అందించడమే కాకుండా, ఎకరాకు 4200 /- చొప్పున నాలుగేళ్ల పాటు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, అందువల్ల జిల్లాలోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ముందుకు రావాలని అన్నారు. ఆయిల్ పామ్ తోటల నుండి అధిక దిగుబడులు సాధించడమే కాకుండా, మంచి లాభాలను కూడా పొందవచ్చని ఆయన తెలిపారు. కేవలం 3 సంవత్సరాల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుందని, తర్వాత 25 సంవత్సరాల పాటు ఆయిల్ పామ్ తోటల నుండి దిగుబడి వస్తుందని, కొద్దిపాటి నీటితో కూడా ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేందుకు అవకాశం ఉందని, ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సబ్సిడీపై ఆర్థిక సహకారం అందిస్తున్నందున జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు.
ఉద్యాన శాఖ డిడి సాయిబాబా, దేవరకద్ర హర్టికల్చర్ అధికారి మహేందర్, జడ్చర్ల హర్టికల్చర్ అధికారి హిమబిందు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు బాలరాజు, రఘు, మహిళ రైతు భర్త సుధాకర్ లాల్ ,తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

 

 

 

 

Share This Post