MBNR – ఇతర జిల్లాల నుండి మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయించబడి ఇంకా కేటాయింపు ఉత్తర్వులు రాని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.

ఇతర జిల్లాల నుండి మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయించబడి ఇంకా కేటాయింపు ఉత్తర్వులు రాని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
ఉపాధ్యాయుల కేటాయింపు,రిపోర్టింగ్ అంశం పై శుక్రవారం ఆయన డి ఈ ఓ, ఎం ఈ ఓ లు, పాఠశాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేటాయింపు ఉత్తర్వులు రాని ఉపాధ్యాయులు ల్యాండ్ లైన్ 08542-252203, 08542-241165, సెల్ ఫోన్ 9573262022 లేదా9848757542 నంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరేందుకు వారి వెసులుబాటు కోసం రాత్రి పొద్దుపోయే వరకు కూడా జాయినింగ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు గాను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలను తెరిచే ఉంచుతారని ఆయన పేర్కొన్నారు.
962 మందికి గాను ఇప్పటివరకు 755 మంది ఉపాధ్యాయులు జాయిన్ అయినట్లు కలెక్టర్ తెలిపారు.
కాగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుండి ఉపాధ్యాయుల జాయినింగ్ రిపోర్ట్ లకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఈ ఓ ఉషా రాణి,తదితరులు ఉన్నారు

 

 

Share This Post