MBNR – ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలనుండి జిల్లాలోకి వరిధాన్యం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.

ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలనుండి జిల్లాలోకి వరిధాన్యం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.
ధాన్యం సేకరణపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యానికి సంబంధించి ఓ పి ఎం ఎస్ ను వెంట, వెంటనే అప్ డే ట్ చేయాలని ,తక్షణమే రైతులకు డబ్బులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే మార్కెట్ కు వచ్చే దాన్యాన్ని అంచనా వేసి ఎప్పటికప్పుడు మిల్లులలో తగినంత స్థలాన్ని ఉంచుకోవాలని, ట్రక్ సీట్లను వెంటనే వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి జిల్లా లోకి ధాన్యం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చూడాలని ,దాన్యం డబ్బుల చెల్లింపు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ పునరుద్ఘాటించారు .
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డి ఆర్ డి ఓ యాదయ్య, డి ఎస్ ఓ వనజాత, సివిల్ సప్లయిస్ డిఎం జగదీష్, జిల్లా వ్యవసాయ అధికారి ని సుజాత ,రైస్ మిల్లర్లు ,మార్కెటింగ్ అధికారులు,ఇతర అధికారులు ,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

Share This Post