MBNR – ఈనెల 18న అవార్డు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

@ రికార్డ్ రూమ్ కంప్యూటరైజేషన్ మరియు 100 శాతం డిజిటలైజేషన్ చేసినందుకుగాను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కు 2021 గవర్నెన్స్ నౌ ఫోర్త్ డిజిటల్ ఫార్మేషన్ అవార్డు
@ ఈనెల 18న అవార్డు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రికార్డ్ రూమును కంప్యూటరైజేషన్ చేయటమే కాకుండా నూటికి నూరుశాతం డిజిటలైజేషన్ చేసినందుకుగాను జిల్లా కలెక్టర్ కు 2021 సంవత్సరపు గవరనెన్సు నౌ ఫోర్త్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం అధికారిక సమాచారం అందింది .ఈనెల 18న జిల్లా కలెక్టర్ కు ఈ అవార్డును వర్చువల్ పద్ధతిలో ప్రదానం చేయనున్నారు.ఈ అవార్డు ఎంపికలో భాగంగా వచ్చిన అన్ని నామినేషన్లను పరిశీలించిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా 100% డిజిటలైజేషన్ చేసినందుకుగాను గవర్నెన్స్ నౌ ఫోర్త్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డుకు ఎంపిక అయ్యింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని రికార్డు రూం డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ 2017 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు వచ్చిన తర్వాత ఊపందుకుంది. నూటికి నూరు శాతం డిజిటలైజషన్ సాధించింది.
ఈ డిజిటలైజేషన్ లో భాగంగా సుమారు 150 సంవత్సరాలకు పూర్వం ఉర్దూ, పార్సీ భాషలలో రాసిన రికార్డులు, ఇతర పత్రాలను కూడా నూటికి నూరు శాతం డిజిటలైజేషన్ చేయడం జరిగింది.50 లక్షల పేజీలను స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేయడం విశేషం. పేజీలను స్కాన్ చేయడమే కాక వాటికి ఇండెక్స్ ఏర్పాటు చేసి, కంప్యూటర్ లో అప్లోడ్ చేయడం జరిగింది. జిల్లాల విభజన సందర్భంగా ఆయా జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే ఒక్క క్లిక్ తో ఆయా జిల్లాలకు చేరవేయడం డిజిటలైజేషన్ లో ముఖ్యమైన అంశం. గతంలో ఒక రికార్డును బయటకు తీసేందుకు కనీసం పది ,పదిహేను రోజులు పట్టేది .అలాంటిది డిజిటలైజషన్ వల్ల ఒకే ఒక్క క్లిక్ తో వెంటనే సమాచారాన్ని తీసుకునే అవకాశం దొరికింది. అంతేకాక పాత ఫైలును బయటకు తీసేందుకు సిబ్బందికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేవి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా తక్షణమే వాటిని తీసుకునే అవకాశం కంప్యూటర్ ద్వారా కలుగుతున్నది .
1900 సంవత్సరం నుండి 1979 వరకు సుమారు 4491 ఫైళ్లు డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అంతేకాక ఉర్దూ,పార్సీ భాషలో 1200 సంవత్సరం నుంచి 1499 సంవత్సరాలకు సంబంధించి 1,848 ఉర్దూ, పార్సీ ఫైళ్ళను కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం 65544 ఫైళ్లు డిజిటలైజేషన్ చేయగా ఇందులో యాభై లక్షల పేజీలను డిజిటల్ చేయడం విశేషం.
అంతేకాక దీంతో పాటు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఉద్యోగులందరి సర్వీస్ రిజిస్టర్లు కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది. వీటితోపాటు 72 జిల్లా ఆఫీసులను,మండల ఆఫీసులను ఈ- ఆఫీస్ కిందికి తీసుకురావడం జరిగింది. కరోనా సమయంలో 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకించి ఆన్లైన్ తరగతులను డిజిటలైజేషన్ మోడ్ లో ప్రారంభించి ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలను అందించడం జరిగింది. అంతేకాక బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావడమే కాకుండా, డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉర్దూ కంటెంట్ ను జోడించడం జరిగింది .వీటితోపాటు కరోనా సమయంలో నిత్యావసర సరుకులను ఆన్లైన్ ద్వారా సరఫరా చేసేందుకు హెల్ప డేస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవేకాక గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ సర్వేక్షన్ లో గ్రేడింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా డిజిటలైజేషన్ చేయించిన ఘనత ఎస్. వెంకట రావు కు దక్కింది.
రికార్డ్ రూమ్ 100 శాతం డిజిటలైజషన్ చేసినందుకు గతంలో స్కాచ్ అవార్డు వచ్చింది . మహబూబ్నగర్ జిల్లాకు, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావుకు గవరనెన్సు నౌ ఫోర్త్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు రావడం పట్ల రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తో పాటు, జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను అభినందించారు.

Share This Post