MBNR – ఈనెల 8 నుండి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

ఈనెల 8 నుండి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కొద్దీ మంది అధికారులతో చర్చించారు.
ముఖ్యంగా వజోత్సవాల నిర్వహణకు రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళిక, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించబోయే జిల్లా స్థాయి సమీక్ష సమావేశం లో చర్చించే అంశాలు,ఇతర ప్రణాళిక వంటివి సిద్ధం చేసే విషయమై అధికారులతో చర్చించారు. అంతేకాక స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇంటింటికి జెండాల పంపిణీ ,అన్ని ఇండ్లపై జెండాలను ఎగరవేసేందుకు జెండాల సంసిద్ధత పై కూడా చర్చించారు.
స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ తేజస్ నందసలాల్ పవర్ ,డిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ అనిల్ కుమార్ తదితర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post