MBNR – ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న “పోషణ్ అభియాన్” కార్యక్రమం కింద జిల్లాలోని మహిళలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న “పోషణ్ అభియాన్” కార్యక్రమం కింద జిల్లాలోని మహిళలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో పోషన్ అభియాన్ పోస్టర్ ను, టేబుల్ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
గ్రామస్థాయిలో నిర్వహించే గ్రామ సమాఖ్య సమావేశాలలో పోషన్ అభియాన్ అంశాన్ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని చర్చించాలని, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కూడా పోషణ అభియాన్ ను నిర్వహించాలని అన్నా.రు పట్టణాలతోపాటు, గ్రామాలలో పోషన్ అభియాన్ కార్యక్రమం ఎలా జరుగుతుందో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక అధికారులను ఆదేసొంచారు.
పోషన్ అభియాన్ కింద పరిశుభ్ర తాగునీరు , పౌష్టికాహారం ,ఆ వారంలో చేయవలసిన పనులు, పోషణ్ అభియాన్ కింద చేపట్టే అవగాహన కార్యక్రమాలపై పట్టణాలు మొదలుకొని గ్రామ స్థాయి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిఆర్ఓ కె. స్వర్ణలత, మహిళా శిశు సంక్షేమ అధికారి ని రాజేశ్వరి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post