MBNR – ఈ నెల 1 నుండి 31 వరకు నిర్వహించనున్న “క్లీన్ ఇండియా” కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.

ఈ నెల 1 నుండి 31 వరకు నిర్వహించనున్న “క్లీన్ ఇండియా” కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.
శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువక కేంద్రం ద్వారా నెల రోజుల పాటు నిర్వహించనున్న “క్లీన్ ఇండియా” కార్యక్రమం పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు .
“క్లీన్ ఇండియా” కార్యక్రమంలో అందరిని భాగస్వాములను చేయాలని ,ప్రత్యేకించి యువత ,క్రీడాకారులు, విద్యార్థులు, మహిళలు అందరిని భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని నెహ్రూ యువక కేంద్రం కోఆర్డినేటర్ కోట నాయక్ ను ఆదేశించారు.
డిఆర్డిఓ యాదయ్య ,డిపిఆర్ఓ యు. వెంకటేశ్వర్లు, డీఈఓ ఉషారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు రఘు,దేవన్న,ఏపీ డి శారద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post