MBNR – ఈ నెల 11 నిర్వహించనున్న “జాతీయ లోక్ అదాలత్”కు కచ్చి దారులు పెద్ద సంఖ్యలో హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి ఎస్. ప్రేమవతి కోరారు.

బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కోర్టు సముదాయంలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ కోర్టులలో 26,938 కేసులు పెండింగ్ లో ఉండగా జాతీయ లోక్ అదాలత్ లో 2809 కేసులు పరిష్కరించేందుకు గుర్తించడం జరిగిందని తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ లో కచ్చి దారులు సివిల్ కేసులతో పాటు, కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులు ,ఎక్సైజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్డు ప్రమాదాల వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని, అంతేకాక రాజి పడగలిగే క్రిమినల్ కేసులను కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.
జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో భాగంగా మహబూబ్ నగర్లో 5, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట ,అలంపూర్, ఆత్మకూరు,కొడంగల్,కల్వకుర్తి లలో ఒక్కొక్క బెంచ్, షాద్ నగర్, గద్వాల్, వనపర్తి , నాగర్ కర్నూల్ ల లో మూడేసి చొప్పున, నారాయణపేటలో 2, జడ్చర్ల లో 1, కొల్లాపూర్ లో 1 మొత్తం 26 బెంచిలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా కేసుల ప్రత్యక్ష పరిష్కారం తో పాటు , వీడియో కాన్ఫెరెన్సు ద్వారా కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు.కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని పూర్తి గా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకొంటు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు .అందువల్ల కచ్చిదారులు పెద్ద సంఖ్యలో జాతీయ లోక్ అదాలత్ కు హాజరై వారి కేసులు పరిష్కరించుకోవాలని కోరారు .
జాతీయ లోక్ అదాలత్ వల్ల కచ్చి దారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, అంతేకాక కోర్టు కేసు నిమిత్తం చెల్లించిన ఫీజు కూడా వాపస్ వస్తుందని ఆమె వెల్లడించారు . జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ఎక్కువ మందికి న్యాయ సేవలు అందించే అవకాశం కూడా ఉందని ఆమె వెల్లడించారు.
ఈ ప్రెస్ మీట్ కు మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.రఘురామ్, ఏడవ అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి రమాకాంత్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకట్ రామ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం. సంధ్యారాణి, జుడిషియల్ మెజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ దీప్తి, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ( స్పెషల్ మొబైల్ కోర్ట్) డి వి ఆర్ తేజో కార్తిక్,జ్యూడిషల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్( ప్రొహిబిషన్ &ఎక్సైజ్ కోర్ట్ ) కె. శిరీష తదితరులు హాజరయ్యారు.

 

Share This Post