MBNR – ఈ నెల 20 న నిర్వహించనున్న వైన్ షాపుల డ్రా కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.

ఈ నెల 20 న నిర్వహించనున్న వైన్ షాపుల డ్రా కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.
మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని వైన్ షాప్ లను డ్రా పద్ధతిన కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.ఇందుకుగాను వైన్ షాపుల కేటాయింపు నిర్వహించే డ్రా కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ వైన్ షాప్ ల డ్రా కోసం మహబూబ్ నగర్ సమీపంలోని అప్పన్నపల్లి వద్ద నున్న వైట్ కన్వెన్షన్ లో చేస్తున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు.
వైన్ షాపుల డ్రా నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ,ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులును ఆదేశించారు.
కాగా మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, కోస్గి, నారాయణపేట ప్రాంతాలలోని 90 వైన్ షాపులకు ఈ నెల 20 న ఉదయం 11 గంటలకు అప్పన్నపల్లి సమీపంలో ఉన్న వైట్ కన్వెన్షన్ లో జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ 90 వైన్ షాప్ లకు 1530 దరఖాస్తులు వచ్చాయి. ఈ డ్రా లో షాపులు దక్కించుకున్న వారు ఒకటి బై ఆరో వంతు తక్షణమే చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు తెలిపారు.

Share This Post