MBNR – @ ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ పనులకు తక్షణమే టెండర్లు పిలవండి.-జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.

@ ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ పనులకు తక్షణమే టెండర్లు పిలవండి. – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా చేపట్టనున్న ఉదండాపూర్ పునరావాస కేంద్రం పనులకు సంబంధించి 10 రోజుల్లో టెండర్లను పిలవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఉదండాపూర్ పునరావాస కేంద్రం పనులపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమ్మిళిత సమావేశం ఏర్పాటు చేశారు.
పునరావాస కేంద్రంలో పనులు చేపట్టేందుకు ముందు టెండర్లు ఫైనలైజ్ చేయాలని, ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు టెండర్లు పిలవాలని, నిర్దేశించిన సమయంలో టెండర్ షెడ్యూల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు .
ముందుగా సంబంధిత శాఖల అధికారులందరితో ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో వాక్ ఓవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఆర్ అండ్ ఆర్ పనుల పై నిర్వహించిన ముఖ్యమైన సమావేశానికి ఆయా శాఖల ఎస్ ఈ లు హాజరు కాకపోవడం బాధకారమని, ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖల కార్యదర్శులకు లేఖలు రాయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావుకు సూచించారు.
ఆర్ అండ్ ఆర్ లే అవుట్ కు సంబంధించిన సాఫ్ట్,హార్డ్ కాపీల ను అప్పటికప్పుడే సమావేశానికి హాజరైన అధికారులకు కలెక్టర్ ఇప్పించారు.
పునరావాస కేంద్రంలో రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని , ఉదండాపూర్, వల్లూరు లలో పార్కుల నిర్మాణం, పాఠశాలల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పనుల పై సమీక్షించారు.
అంతేకాక పంచాయతీరాజ్ ద్వారా చేపట్టనున్న వైకుంఠధామం,చెత్తను వేరు చేసే షెడ్డులు, దేవాలయాల నిర్మాణం, ఆర్ అండ్ బి ద్వారా రహదారులు, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా ఆర్ అండ్ ఆర్ కాలనీ లో విద్యుత్ స్తంభాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , పాఠశాలల భవనాల నిర్మాణం, మిషన్ భగీరథ తాగునీటి విషయాలపై శాఖల వారీగా సమీక్షించారు.
ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ పనులు ఒక ల్యాండ్ మార్క్ గా ఉండాలని, ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా ఆర్ అండ్ ఆర్ ను తీర్చిదిద్దాలని, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న రైతులు భూములు,ఇండ్లు కోల్పోయిన వారికి సంతోషం కలిగించే విధంగా త్వరితగతిన ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేస్తే బాగుంటుందని కలెక్టర్ అన్నారు.పనులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు మూడు షిఫ్ట్ ల లో పనిచేయాలని, షెడ్యూలును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ,రెండు నెలల్లో రహదారులు పూర్తి చేయాలని ఆదేదించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈ రమేష్,ఎస్ ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటరమణ, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ ,పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, ఉద్యానశాఖ డి డి సాయి బాబా, ట్రాన్స్కో,తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post