MBNR – ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం నూతన స్థానిక కేడర్ కేటాయింపు వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు.

ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం నూతన స్థానిక కేడర్ కేటాయింపు వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు.
ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు విషయమై శుక్రవారం ఆయన తన కార్యాలయం నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటివరకు స్థానిక కేడర్ కేటాయింపు పూర్తయిన శాఖలు ,కంప్యూటర్ జనరేటెడ్ ఉత్తర్వులు, ఉద్యోగులకు ఉత్తర్వుల అందజేత వంటివన్నీ ప్రభుత్వం నిర్దేశించిన సమయం లోపు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. కంప్యూటర్ ద్వారా ఉత్పత్తి అయిన ఉత్తర్వులు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతేకాక ఆయా శాఖల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులు, మాస్టర్ డేటా ప్రకారం ఎంట్రీ చేసిన వివరాలు, ఉత్తర్వులు అందుకున్న వారి వివరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరావేయాలని ఆయన ఆదేశించారు .
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజసనందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తదితరులు ఈ వీడియో కాన్ఫెరెన్సు కు హాజరయ్యారు .

Share This Post