MBNR – ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపు లో భాగంగా ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఐచ్చికాలను ఇవ్వాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.

@ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపుకు ఉద్యోగుల ఐచ్చికం తప్పనిసరి @ఐచ్చికం ఇవ్వకుంటే కోరుకున్న స్థానం దక్కకపోవచ్చు
@అందువల్ల ప్రతి ఉద్యోగి తప్పని సరిగా ఐచ్చికం ఇవ్వాలి
@ఉద్యోగుల నుండి ఐచ్చికాలు తీసుకొనే బాధ్యత సంబంధిత శాఖల జిల్లా అధిపతులదే- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు వెల్లడి.
ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపు లో భాగంగా ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఐచ్చికాలను ఇవ్వాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
గురువారం ఆయన ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపుపై జిల్లా,మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఆప్షన్ ఇవ్వాలని తెలిపారు .లేకుంటే వారు కోరుకున్న జిల్లా రాకపోవచ్చని అన్నారు. అంతేకాక వారి అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు.అందువల్ల ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా వారి వారి శాఖాధికారులకు వెంటనే ఆప్షన్లను సమర్పించ వలసిందిగా ఆదేశించారు .ఈ విషయమై సంబంధిత శాఖల జిల్లా అధికారులు కూడా వారి కింద పనిచేసే కార్యాలయాలు, ఉద్యోగులకు వివరంగా తెలియచేయాలని చెప్పారు .రేపు మధ్యాహ్నం లోగా 100 శాతం ఆప్షన్లు సమర్పించాలన్నారు.ఆప్షన్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవిన్యూ అదనపు కలెక్టర్ కే., సీతారామారావు ,జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Share This Post