MBNR – ఎంవిఎస్ కళాశాల మైదానంలో 3 కోట్ల రూపాయలతో కొత్త స్టేడియం మంజూరు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.

ఎంవిఎస్ కళాశాల మైదానంలో 3 కోట్ల రూపాయలతో కొత్త స్టేడియం మంజూరు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.
@ మహబూబ్ నగర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి
@ భవిష్యత్తు మహబూబ్ నగర్ ఎలా ఉండాలో రోడ్ మ్యాప్ తయారీ @మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి పై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి
మహబూబ్ నగర్ పట్టణ రూపురేఖలు మార్చి హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దాలన్న తలంపుతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి పై సోమవారం ఆయన మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్ తదితర అధికారులతో సమీక్షించారు.
ముఖ్యంగా పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రహదారుల అభివృద్ధి, రహదారుల పై మొక్కలు నాటే కార్యక్రమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు

ఇందులో ముఖ్యమైనవి

@ 3.5 కోట్ల రూపాయలతో ఎం వి ఎస్ కళాశాల మైదానంలో నూతన స్టేడియం ఏర్పాటుకు నిర్ణయం
@ ప్రస్తుతం ఉన్న ఫిష్, మీట్ మార్కెట్ లో 3 కోట్ల రూపాయలతో మరో మార్కెట్ నిర్మించాలని నిర్ణయం
@ 8 కోట్ల రూపాయలతో చేపట్టిన స్లాటర్ హౌస్ నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశం
@ రహదారి విస్తరణలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో చేపట్టిన రహదారి మధ్యలో 10 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద పెద్ద మొక్కలను రోడ్డు మధ్యలో నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం
@ఈ వారం లో ఎలాంటి పనులు చేపట్టాలో సమావేశంలో చర్చ.
@ ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద సమీకృత మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సమావేశంలో నిర్ణయం
@ పట్టణంలో గ్యాస్ క్రిమేటోరియం ఉన్నప్పటికీ శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీలకు వెనకవైపు అనుకొని ఉన్న స్థలంలో పూర్తి ఆధునీకరించిన గ్రేవీ యార్డ్ నిర్మాణానికి చర్యలు
@ బైపాస్ రహదారి వెంట లైటింగ్ పనులతోపాటు,ఫుట్ పాత్ పనులు, బూత్ పూర్ నుండి మహబూబ్ నగర్ వరకు తక్షణమే సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టేందుకు నిర్ణయం
@ పట్టణంలోని అన్ని జంక్షన్ ల ఆధునీకరణ
@ హన్వాడ వద్ద 500 ఎకరాల తో చేపట్టిన ఫుడ్ పార్క్ పనులు వేగవంతం @ఆప్పన్న పల్లి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,భూముల పై చర్చ
@పట్టణంలో నూతనంగా నిర్మించే కాంప్లెక్స్ కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బంది ఉండకుండా పార్కింగ్ స్థలం ఏర్పాటు @అంతేకాక ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఇప్పటి నుండే కార్యాచరణ ప్రణాళిక
@పట్టణంలో చేపట్టిన అన్ని పనుల పూర్తికి ఆదేశం. కొత్త ప్రతిపాదనలపై చర్చ @ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు ప్రతి గ్రామంలో ఒక స్టేడియం ఏర్పాటుకు నిర్ణయం
@ విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో కూడా రాణించేందుకు కృషి
@ చిన్నదర్పల్లి నుండి ధర్మాపూర్ వరకు చేపట్టే కొత్త బైపాస్ రోడ్డుకు తుది రూపం ఇచ్చి జాతీయ రహదారులు లేదా ఇతర పథకంలో పూర్తికి నిర్ణయం
@టూరిజం కింద చేపట్టిన గదుల నిర్మాణం, తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆదేశం @స్టేడియంలో మంజూరు చేసిన పనులు వేగవంతంగా పూర్తి కి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశం
వీటన్నింటికీ భవిష్యత్తు మహబూబ్ నగర్ ఎలా ఉండాలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాక ప్రతి అధికారి వారి శాఖ ద్వారా చేపటెందుకు ఆస్కారమున్న పనులపై కూడా త్వరలోనే జిల్లా అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.
మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిపిఓ దశరథం, ఆర్ అండ్ బి డిఈ సంధ్య,పి ఆర్ ఈ ఈ నరేందర్, ఇతర అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post