MBNR – ఎన్నో అద్భుత పథకాలకు కేంద్ర బిందువు తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఎన్నో అద్భుత పథకాలకు కేంద్ర బిందువు తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం జిల్లా పరిషత్తు మైదానంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద సుమారు 405 మంది లబ్ధిదారులకు 4 కోట్ల54 లక్షల 6980 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఇందులో 185 షాదీ ముబారక్ లబ్దిదారులుండగా,తక్కినవి కళ్యాణ లక్ష్మి చెక్కులు.
ఈ సందర్భంగా మంత్రి లబ్దిదారులనుద్దేశించి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం పేద ప్రజల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయలేదని ,తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి ,మైనారిటీ ,అగ్రవర్ణాల లో వెనుకబడిన పేదల ఆడపిల్లల పెళ్లిళ్ల విషయంలో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ తాగునీరు ,రహదారులు, రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నో అద్భుత పథకాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్రబిందువైంది అని అన్నారు.
పేద ప్రజల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలలో మధ్య దళారీల జోక్యం చేసుకోకూడదని, ఎవరైనా అలా జోక్యం చేసుకోన్నట్లయితే కఠినంగా వ్యవహరిస్తామని ,పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014 పూర్వం రాష్ట్రంలో ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటిది ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు తాగు నీరు వచ్చేలా చేశామని ,అదే విధంగా విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించామని తెలిపారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష్యులు రాజేశ్వర్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, కౌన్సిలర్లు,ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Share This Post