MBNR – కల్తీ విత్తనాలను అరికట్టడంలో ప్రత్యేకించి పత్తి విత్తనాల విషయంలో వ్యవసాయ,పోలీస్,రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి

@కల్తీ విత్తనాలను అరికట్టడంలో ప్రత్యేకించి పత్తి విత్తనాల విషయంలో వ్యవసాయ,పోలీస్,రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి
@వెదజల్లు పద్ధతి ద్వారా వరి సాగును ప్రోత్సహించాలి
@ పచ్చిరొట్ట ఎరువుల పై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి @ఎరువులు పురుగుల మందులు తగు మోతాదులో వాడే విధంగా చైతన్యం చేయాలి-జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
కల్తీ విత్తనాలను అరికట్టడంలో ముఖ్యంగా కల్తీ పత్తి విత్తనాలను నివారించడంలో వ్యవసాయ,రెవెన్యూ ,పోలీస్ అధికాలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు. మహబూబ్ నగర్ లాంటి నీరు తక్కువగా ఉండే జిల్లాకు వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు ఎంతో మేలని , అందువల్ల ఈ పద్ధతి పై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఈ వాన కాలం నుండి ఈ పద్ధతి ద్వారా వరి సాగు చేసేందుకు ప్రోత్సహించాలని చెప్పారు.
శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని కోరారు. వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు దోహదం చేస్తున్న వరిలో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని చెప్పారు. రసాయన ఎరువులను తగ్గించి సంప్రదాయ ఎరువులను ప్రోత్సహించే దిశలో భాగంగా పచ్చి రొట్టె ఎరువులను ప్రోత్సహించాలని, రైతులు ఈ ఎరువులు సాగు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే పెద్ద మొత్తంలో ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల రైతుకు సాగు ఖర్చులు పెరగడమే కాకుండా, పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో ఎరువులు ఏ విధంగా వాడాలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పొలంలో భాస్వరం తగ్గించే పద్ధతులు పాటించాలని, ముఖ్యంగా విత్తన శుద్ధి కి వీటిని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.రైతు బంధు ,రైతు భీమా,వ్యవసాయంలో నూతన పద్దతులపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు.
వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులతో ముందుకు వెళ్లాలని, రైతులకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దాన్యం కొనుగోలు విషయంలో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి వెంకటేశ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post