MBNR – కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయ పల్లి లోని న్యాక్ అకాడమీలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గ్రూప్ 1,4 ఉద్యోగాల కోసం నిరుద్యోగ ఎస్ టి యువతకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు ఉద్యోగాల భర్తీ కోసం అతి పెద్ద నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, అందువల్ల నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆయన కోరారు. నిర్వాహకులు కనీసం వంద మంది షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిక్షణకు వచ్చిన వారికి ఉచిత భోజనం తో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ,కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందని ఆయన అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ఎస్ టి అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గిరిజన ఉద్యోగుల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ తో పాటు, స్టేడియం పక్కనే బాలికల కళాశాల వసతి గృహం, గిరిజన భవనం, సేవాలాల్ మహారాజ్ దేవాలయం,వంటి వాటిని సుమారు 14 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నామని, జిల్లాలోని తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దామని, ఇదే కాకుండా గ్రామ పంచాయతీల తో సమానంగా వాటిని అభివృద్ధి చేస్తున్నామని, రైతుబంధు,రైతు భీమా,పెంచన్లు, విద్యుత్తు ,రహదారులు అన్ని సౌకర్యాలను చేశామని మంత్రి వెల్లడించారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్ పి ఆర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ నర్సింలు,ముడా చైర్మన్ గంజి వెంకన్న, డి టిడివో క్షత్రు నాయక్ ,స్థానిక కౌన్సిలర్ లు ,ఇతర ప్రజాప్రతినిధులు ,అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post