MBNR – కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో నిర్వహించిన కళాశాల వార్షిక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ విద్య మనిషి జీవితంలో ఒడిదుడుకులు కు అవకాశం ఉండే వయస్సని,అందువల్ల ఈ సమయంలో మంచిని గ్రహించి కష్టపడి చదివి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం మహబూబ్ నగర్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, డిగ్రీ ,పీజీ ఆపై చదువులు చదివేందుకు అవకాశాలున్నాయని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు ఉద్యోగాల కోసం ఉచితంగా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నదని ఆయన తెలిపారు.మహబూబ్ నగర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, రహదారుల వెడల్పు,శిల్పారామం,నెక్లెస్ రోడ్ వంటి వాటి తో పాటు, ఇంకా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థినిలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో చదువును నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీసేందుకు కష్టపడి చదవాలని, చదువుతో పాటు, క్రీడలు ఇతర అంశాలలో కూడా రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంసెట్ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేస్తామని,ఓకేషల్ విద్యార్థులకు కూడా శిక్షన్స్ ఇస్తామని, అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి జాతీయస్థాయిలో పథకాలు సాధించిన ముస్కాన్ ఖాన్, నాజియా తబస్సుమ్ లను మెడల్ తో సత్కరించారు.
కళాశాల ప్రిన్సిపల్ కౌశర్ జహాన్, కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ ,ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి , తదితరులు ఉన్నారు.

 

 

 

Share This Post