MBNR – కొవిడ్ వాక్సినేషన్ లో భాగంగా రెండవ డోస్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

కొవిడ్ వాక్సినేషన్ లో భాగంగా రెండవ డోస్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు .
సంజయ్ నగర్ లో ఇప్పటివరకు వ్యాక్సినేషన్ తీసుకొనని వారికి దగ్గరుండి వాక్సిన్ వేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాక్సినేషన్ ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మరో వారం రోజుల పాటు కష్టపడి చేసి జిల్లాకు నిర్దేశించిన వాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించాలని అన్నారు .వైద్య ఆరోగ్య, ఆశ ,అంగన్ వాడి,మహిళా సంఘాలు సుమారు 50 వేల మందికి పైగా వాక్సినేషన్ పైనే పనిచేస్తున్నారని, అందువల్ల నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు .ముఖ్యంగా చౌక ధరల దుకాణాల డీలర్లు, కౌన్సిలర్లు,ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోసు పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన గా ఆయన కోరారు.
డాక్టర్ రఫీ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

 

Share This Post