MBNR – కోటి రూపాయల వ్యయంతో మహీంద్రా అండ్ మహీంద్రా సౌజన్యంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

@ ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగింది
@ అత్యాధునిక సౌకర్యాలతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి
@ 400 కోట్లతో త్వరలోనే పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణం
@ కోటి రూపాయల వ్యయంతో మహీంద్రా అండ్ మహీంద్రా సౌజన్యంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్ సిలిండర్ కూడా లేని పరిస్థితి మహబూబ్ నగర్ ఆస్పత్రిదని, కానీ ప్రస్తుతం ఆక్సిజన్ తో కూడిన 560 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి పరిచామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం ఆయన కోటి రూపాయల వ్యయంతో మహీంద్రా అండ్ మహీంద్రా సౌజన్యంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఆసుపత్రిలో 2014 కంటే ముందు కేవలం 14 మంది వైద్యులు ఉండే వారని,
కానీ ప్రస్తుతం వందల మంది డాక్టర్లు,నర్సులు, సిబ్బంది,అత్యాధునిక వైద్య పరికరాలతో ఆస్పత్రిలో నాణ్యతాయుతమైన సేవలు అందిస్తున్నామన్నారు.
గాంధీ,ఉస్మానియా తరువాత మహబూబ్ నగర్ లో జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామని,వారం క్రితం ఒక ఆక్సీజన్ ప్లాంట్ ప్రారంభించామని,మహీంద్రా ఆధ్వర్యంలో నిమిషానికి 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు అభినందించారు.
మహీంద్రా లాంటి కంపెనీలు పాలమూరులో మరిన్ని పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించడానికి ముందుకు రావాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తే 100శాతం సహకరిస్తామని,కంపెనీల విషయంలో తెలంగాణ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నదన్నారు.ఇక్కడి యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నామని,అతి త్వరలోనే 400కోట్ల వ్యయంతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించబోతున్నామని వెల్లడించారు.
మహీంద్రా అండ్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ రామ్ తదితరులు మాట్లాడారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సభ్యులు వెంకన్న ,లక్ష్మి ,మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ప్రదీప్ గౌడ్, ఫైనాన్స్ హెడ్ బాల బ్రహ్మేశ్వర రావు, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

Share This Post