MBNR – కోవిడ్ వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా వాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని నూటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.

శనివారం ఆయన జడ్చర్ల పట్టణం లోని 25 వ వార్డు లో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వాక్సినేషన్ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు.ఒక్కో కేంద్రంలో ఒక రోజుకు వంద మందికి వాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా జిల్లా కలెక్టర్ సందర్శించే సమయానికి 25 వ వార్డు లో ఏర్పాటుచేసిన కేంద్రంలో 83 మంది కి వాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు .
కాగా జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన అన్ని 27 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కూడా ఇదే విధంగా నిర్వహించాలని,18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్లను, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం హరితహారం పై మున్సిపల్ కమిషనర్ కు సూచనలు చేస్తూ మహబూబ్ నగర్- జడ్చర్ల రహదారిపై మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న విధంగా నే సెంట్రల్ మీడియన్లో హరితహారం కింద పెద్ద పెద్ద మొక్కలు నాటాలని ఆదేశించారు.
జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సునీత ,వైద్యాధికారులు శివ కాంత్, సునీల్ తదితరులు ఉన్నారు.

Share This Post