MBNR – కోవిడ్ వాక్సినేషన్ మరింత ఉధృతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

@ కోవిడ్ వాక్సినేషన్ మరింత ఉధృతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు పిలుపు
@ప్రస్తుత ఊపును మరో వారం రోజుల పాటు కొనసాగించాలి
@అనుకున్న లక్ష్యాలను ఎట్టి పరిస్థితులలో సాధించాలి

వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, మరో వారం రోజుల పాటు ఇలాగే పని చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.
గురువారం ఆయన జిల్లా,మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, వైద్య అధికారులు ,సిబ్బందితో వాక్సినేషన్ విషయంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
మొదటి డోసు నూటికి నూరు శాతం పూర్తి కావాలని, అదేవిధంగా రెండవ డోసు పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు .ఇందుకుగాను ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా గ్రామాలకు వెళ్లాలని ,వారం రోజుల పాటు ఇదే పనిపై దృష్టిసారించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేకించి మహిళా సంఘాలు కృషి చేయాల్సిందిగా కోరారు. మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాక్సినేషన్ బృందాలకు ఆహారం ,తాగునీరు ,ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.
గురువారం ఒక్కరోజే జిల్లాలో మొదటి డోసు లక్ష్యాన్ని 96 శాతానికి తీసుకురావాలని, అదేవిధంగా రెండవ డోసు కింద 20 వేల డోసులు లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు .తాసిల్దార్ లు చౌక ధరల దుకాణాల డీలర్లను చైతన్యం చేసి వారితో పాటు, వినియోగదారులందరూ వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సిబ్బందితో ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. మున్సిపాలిటీలలో కూడా మున్సిపల్ కమిషనర్ తో పాటు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు .వ్యాక్సినేషన్ విషయంలో ఆయా అసోసియేషన్ లు కూడా సహకారం అందించాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్ బృందాలకు అవసరమైన సహకారాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు ,వైద్యాధికారులు, ఏ పి ఎంలు, సి డి పి వో లు, ఐసిడిఎస్ సిబ్బంది ,విఆర్వోలు,తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Share This Post