MBNR – కోవిడ్ వాక్సినేషన్ రెండో డోసు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.

కోవిడ్ వాక్సినేషన్ రెండో డోసు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.
రెండవ డోసు విషయమై ఆయన మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో మొదటి డోసు నూటికి నూరు శాతం పూర్తి చేయటంలో కృషి చేసిన ప్రతిజి ఒక్కరినీ ఆయన అభినందించారు. అందరూ కష్టపడి పని చేయడం వల్లనే 100% సాధించామని అన్నారు. అదేవిధంగా రెండవ డోసు వేయటం పై కూడా దృష్టి సారించాలని, ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకుంటేనే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రావడానికి అవకాశం ఉండదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కొత్త వేరియెంట్ వస్తే ప్రమాదం వస్తుందని, అందువల్ల తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునని వారందరూ వేసుకునే లాగా అవగాహన కల్పించాలని అన్నారు. వారం రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా కష్టపడితే రెండవ డోసు లో కూడా 100 శాతం లక్ష్యాలు సాధించి తీరుతామని అన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్ర,జిల్లా సరాసరికన్న తక్కువగా ఉన్నాయని, అందువల్ల ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండవ డోసు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.వాక్సిన్ విషయంలో ఎక్కడ సమస్య లేదని, అనుకున్నన్నీ డోసుల వాక్సిన్ జిల్లాలో సిద్ధంగా ఉందని, అలాగే వాక్సినేషన్ బృందాలకు భోజనం, తాగునీరు, ఇతర ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన తహసిల్దార్లు, పంచాయతీ సెక్రటరీ లను ఆదేశించారు. ముఖ్యంగా తహసీల్దార్లు అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తప్పనిసరిగా సమయం పాటించాలని, ఉదయం ఎనిమిది గంటలకే కోల్డ్ చైన్ ప్రారంభం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
హరిత హారం కింద మొక్కలు నాటే విషయమై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపివోలు ఈ వారం రోజులు మొక్కలు నాటడం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి రహదారులకు ఇరువైపుల నాటే మొక్కలను వందకు వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. అందుబాటులో ఉన్న నిధుల నుండి మొక్కలను తెప్పించి నాటించాలని, 18వ తేదీ నాటికి మొక్కలు నాటడం పూర్తి చేయాలని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ, ఇతర అధికారులు,వైద్యాధికారులు,మండల అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Share This Post