MBNR – కౌకుంట్ల కొత్త మండలం పై గజిట్ నోటిఫికేషన్ జారీ -జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో కొత్త మండలం కౌకుంట్ల మండలం ఏర్పాటుపై గజిట్ ను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు .
జిల్లాలో కొత్త మండలం కౌకుంట్ల మండలాన్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు గజిట్ నంబర్ 51/ 2022 ను తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మండలం ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 15 రోజుల్లో నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ కోరారు. ఈ గజిట్ నోటిఫికేషన్ ను అన్ని జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రచురించాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Share This Post