MBNR – క్రీడా పరంగా మహబూబ్ నగర్ ను ఇంకా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర క్రీడలు,ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

క్రీడా పరంగా మహబూబ్ నగర్ ను ఇంకా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర క్రీడలు,ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ సమీపంలోని ఎం వి ఎస్ కళాశాల ఆవరణలో 2 కోట్ల 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 15 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, వాలీబాల్ అకాడమీ కూడా తీసుకు వచ్చామని తెలిపారు. అంతేకాక స్టేడియం వెనక వైపు నుండి ట్యాంక్ బండ్ పై నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, పట్టణం చుట్టూ బైపాస్ రోడ్లు, రింగ రోడ్ లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.ఎం వి ఎస్ కళాశాలలో కొత్త స్టేడియం నిర్మాణం వల్ల విద్యార్థులకు, అధ్యాపకులకు, చుట్టుపక్కల నివసించే వారికి వాకింగ్ కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
గతంలో ఎం వి ఎస్ కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని, ప్రస్తుతం 50 గదులు ఉన్నాయని, అంతేకాక ఇటీవలే అదనపు తరగతి గదులు కూడా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు .

క్రీడల ద్వారా ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అదేవిధంగా విద్యా వకాశాలలో కూడా క్రీడలకు రిజర్వేషన్ కల్పించామని, భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో యువత ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగ యువత బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలని మంత్రి కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాల కాకుండా ప్రైవేటు ఉద్యోగాలలో కూడా యువకులు చేరటం ద్వారా వారి కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం కౌన్సిలర్లు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post