MBNR – గత నెల 29 న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి వి.శాంతమ్మ గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే.

గత నెల 29 న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి వి.శాంతమ్మ గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే.
ఆదివారం మహబూబ్ నగర్ లోని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన వారి తల్లి దివంగత శాంతమ్మ గారి దశ దిన ఖర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుహాజరై వి. శాంతమ్మ సమాధి వద్ద పుష్పగుచం ఉంచి నివాళులర్పించారు.ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాంతమ్మ మృతికి తన ప్రఘాడ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ,గంగుల కమలాకర్,తలసాని శ్రీనివాస్ యాదవ్,నిరంజన్ రెడ్డి,ఎంపీ లు మన్నే శ్రీనివాస్ రెడ్డి,పోతుగంటి రాములు, పలువురు శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు,జిల్లా పరిషత్ చైర్మన్లు,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,ఎస్.పి ఆర్.వెంకటేశ్వర్లు,పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.

Share This Post