MBNR – గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

@తెలంగాణ కు హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యం
@ గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించాలి
@ ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ,నదులు, వాగుల గట్లపై పెద్ద ఎత్తున సంపద వనాలు పెంచాలి
@ ప్రతి మండలంలో 5 సంపద వనాలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
2022 సంవత్సరంలో జిల్లాలో తెలంగాణ కు హరిత హారం కార్యక్రమంలో చేపట్టనున్న ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో హరితహారం సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా నాటనున్న మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలో కనీసం కోటి మొక్కలు నాటాలని చెప్పారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో సంపద వనాలను పెంచాలని, నది గట్లు ,వాగు గట్లపై సంపద వనాలను పెంచి బయో కంచె ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కొత్త పంచాయతీ రాజ్ ,మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ బడ్జెట్టు నిధులను వినియోగించుకోవాలని తెలిపారు. పొడవాటి, పెద్దవైన మొక్కలను నాటాలని, అన్ని మండలాలలో వాచర్లను నియమించాలని, దేవాదాయ శాఖ ద్వారా అన్ని దేవాలయాల వద్ద రాశి వనాలను పెంచాలని ఆదేశించారు. విద్యాశాఖ ద్వారా ప్రతి మండలంలో కనీసం ఐదు సంపద వనాలను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ద్వారా స్థానిక మండల అటవీశాఖ అధికారుల సహకారంతో పెద్దఎత్తున రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అదే సమయంలో అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సైట్లను నిర్ణయించాలని చెప్పారు. మండల స్థాయి అటవీశాఖ అధికారులు వారి పరిధిలోని తెలంగాణ కు హరిత హారం నర్సరీలను కచ్చితంగా తనిఖీ చేయాలని అన్నారు. మహబూబ్ నగర్ ముంచి పాలిటీ లో చేపట్టిన నర్సరీలు బాగున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ను,మున్సిపల్ కమిషనర్ ను అభినందించారు.గృహ నిర్మాణ శాఖ ద్వారా కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీ లలో గ్రీనరీ పెంపొందించాలని చెప్పారు. ఇరిగేషన్ శాఖ ద్వారా కరివేన, ఉదండాపూర్,కోయిల్ సాగర్ రిజర్వాయర్ లతోపాటు అవకాశం ఉన్న ప్రతిచోటా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ఇందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని మహబూబ్ నగర్ , జడ్చర్ల,భూత్పూర్ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీల ద్వారా పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాక ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకునేందుకు లక్ష్యంలో పది శాతానికి తగ్గకుండా మొక్కలను పంపిణీ చేయాలని ఆదేశించారు.
స్థానిక సంస్థ సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డీఎఫ్ ఓ గంగారెడ్డి, జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు ,ఏ పి ఓ లు,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post