MBNR – గ్రీన్ ఇండియా ఛాలెంజ్ -4 లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ -4 లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
@అనంతరం జిల్లా ఎస్పీ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ -4 ను విసిరిన జిల్లా కలెక్టర్
పచ్చదనాన్ని పెంపొందించడం లో భాగంగా ఎంపీ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ -4 ను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ స్వీకరించి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మొక్కలను నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ల కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్-4 విసిరారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. తాను ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్-4 ను పైన పేర్కొన్న ముగ్గురు అధికారులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

 

Share This Post