MBNR – చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా వారు స్వయం ఉపాధి పొందేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శాశ్వతంగా స్వయం ఉపాధి అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని భవన నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా వారు స్వయం ఉపాధి పొందేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శాశ్వతంగా స్వయం ఉపాధి అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని భవన నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సోమవారం ఆయన మహబూబ్ నగర్ లోని జిల్లా పరిషత్ మైదానం లో జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందిన 96 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫ్రిడ్జ్ మెకానిక్, మొబైల్ సర్వీసింగ్, కేబుల్ టీవీ ఇనస్టాలేషన్, డొమెస్టిక్ ఎలక్ట్రిషన్ ల్లో మూడు నెలల పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన వారికి ఈ ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుకున్నవారికి వారి నైపుణ్యాలను అభివృద్ధి పరిచేలా తమ శాఖ పరిధిలో ఉన్న యువజన సర్వీసుల శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించి వారు జీవితంలో స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఒక మంచి భవనాన్ని నిర్మించి అక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కౌన్సిలర్లు, సర్పంచులు చదువుకున్న నిరుద్యోగులను గుర్తించి వారు ఆయా కోర్సుల ద్వారా శిక్షణ పొందేలా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కె. సి .నరసింహులు, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post