MBNR – చెక్ డ్యామ్ ల వల్ల రైతులకు ఎల్లప్పుడు సాగునీరు అందుబాటులో ఉంతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని వేపూర్ గ్రామంలో రూ. 3 కోట్ల 46లక్షల 50 వేల రూపాయల నిర్మించిన చెక్డ్యాం ను, రూ. 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను మంత్రి ప్రారంభించారు.

చెక్ డ్యామ్ ల వల్ల రైతులకు ఎల్లప్పుడు సాగునీరు అందుబాటులో ఉంతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని వేపూర్ గ్రామంలో రూ. 3 కోట్ల 46లక్షల 50 వేల రూపాయల నిర్మించిన చెక్డ్యాం ను, రూ. 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లు లేకున్నా చెక్ డ్యాంలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎల్లప్పుడూ రైతులకు సాగునీరు అందుబాటులో ఉంతుందని, దీని వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందు చూపు వల్ల చెక్ డ్యాములు నిర్మించడం జరిగిందని అన్నారు. వర్షాలు రాని సమయంలో కూడా చెక్ డ్యాముల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ డి ఏ వెంకటేశ్వర్లు,తహసీల్దార్ బక్క శ్రీనివాసులు,ఎం పి డి ఓ ధనుంజయ్ గౌడ్, ఇరిగేషన్ అధికారులు,వ్యవసాయ అధికారులు, సర్పంచ్ కోస్గి సత్యమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ వెంకట్ రాములు కొప్షన్ మెంబర్ యుమ్.డి. అన్వర్ హుస్సేన్ మన్నన్ వెంకట్రం , కృష్ణయ్య, శ్రీనివాసరెడ్డి రై తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post