MBNR – చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

@ భిన్న మతాలు, కులాలకు నిలయం మహబూబ్ నగర్.

@ అమ్మవారి కృపతో రాష్ట్రం, మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందాలి- చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ అంటేనే భిన్న మతాలు, కులాలకు నిలయంగా మారిందని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ , వీరన్నపేట చౌడేశ్వరి దేవి ఉత్సవాలలో ముఖ్య అథితిగా పాల్గొన్నారు.
అన్ని సామాజిక వర్గాలు కమ్యూనిటీ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాలు, నిధులు అందించి అండగా ఉంటున్నామని మంత్రి తెలిపారు. అన్ని కులాలు, మతాలకు చెందిన పేదలకు తమ ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. కులవృత్తులపై ఆధారపడిన వారందరికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలో వీరన్నపేట ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ, త్వరలో రానున్న బైపాస్ రోడ్డుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారబోతోందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాణి వారు నిరాశ చెందవద్దని,స్థలం ఉంటే ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. అమ్మ వారి కృపతో రాష్ట్రం, మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆకాంక్షించారు.
తొగట క్షత్రియ కమ్యూనిటీ భావన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని మంత్రి అన్నారు.
మున్సిపల్ చైర్మన్ కే.సీ. నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, తోగట వీర క్షత్రియ సంఘం నేతలు చంద్రమౌళి, బాలయ్య, కురుమూర్తి, లక్ష్మినారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post