MBNR – జాతిపిత మహాత్మాగాంధీ చూపించిన సత్యం ,అహింస మార్గాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ చూపించిన సత్యం ,అహింస మార్గాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.
శనివారం ఆయన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్లోని ఎంజీ రోడ్డు ఉన్నత పాఠశాలలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వల్లనే స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామని, ఆయన పాటించిన సత్యం, అహింస ద్వారానే స్వాతంత్రం సాధించామని చెప్పారు. మారుతున్న పరిస్థితులలో కూడా సత్యం అహింస వీడవద్దని, ఈ రెండు ఆచరించడం ద్వారా ప్రపంచంలో భారతదేశానికి మంచి గుర్తింపు,మంచి స్థానం ఉన్నాయని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ చూపిన చొరవ ,సహనం మర్చిపోలేమని కొనియాడారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు వెళ్లాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఎన్సిసి కల్నల్ మిట్టల్ వార్ తడితరులు పాల్గొన్నారు .
ఈ సందర్బంగా జిల్లాకలెక్టర్ ఆజాది క అమృత్ మహోత్సవాల లో భాగంగా స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించారు.

Share This Post